‘లాల్ సింగ్ చడ్డా’ నుండి కరీనా కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్ ….!

Published on Jul 18, 2022 7:00 pm IST

బాలీవుడ్ స్టార్ నటుడు మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ లాల్ సింగ్ చడ్డా. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అమీర్ నటన అదిరిపోయిందని, అలానే మూవీ సూపర్ గా ఉందని ఇటీవల పలువురు టాలీవుడ్ ప్రముఖులతో కలిసి ప్రివ్యూ చూసిన మెగాస్టార్ అభివర్ణించారు. ఇక తెలుగులో మెగాస్టార్ సమర్పణలో రిలీజ్ కానున్న లాల్ సింగ్ చడ్డా మూవీ ఆగష్టు 11న తెలుగుతో పాటు తమిళ్, హిందీ లో రిలీజ్ కానుంది.

అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు చేయగా, నేడు కొద్దిసేపటి క్రితం ఈ మూవీలో హీరోయిన్ గా రూప పాత్రలో నటిస్తున్న కరీనా కపూర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది యూనిట్. కాగా కరీనా ఫస్ట్ లుక్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, లాల్ సింగ్ చడ్డా ప్రేయసి రూప ను మీకు పరిచయం చేస్తున్నాను, వీరిద్దరి బంధం గురించి చెప్పాలంటే ‘ముద్దపప్పు ఆవకాయ’ అంటూ సరదాగా పోస్ట్ చేసారు మెగాస్టార్. కాగా ఈ మూవీలో అక్కినేని నాగచైతన్య, బబ్లు అనే పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :