ప్రముఖ హీరో పై మహిళా కమిషన్‌ సీరియస్ !

ప్రముఖ హీరో పై మహిళా కమిషన్‌ సీరియస్ !

Published on Dec 30, 2018 5:51 PM IST

Duniya Vijay

హీరో మరియు ప్రధాన పాత్రలతో పాటు, నెగెటివ్ పాత్రలు కూడా పోషించే కోలీవుడ్ నటుడు దునియా విజయ్. ఇప్పటికే ఈయన పలు వివాదాల్లో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. కాగా తాజాగా దునియా విజయ్ పై మహిళా కమిషన్‌ సీరియస్ అయింది.

తాము నోటీసు అందజేసినప్పటికీ దునియా విజయ్ విచారణకు హాజరుకాకపోవటం పై మహిళా కమిషన్‌ సీరియస్ అవుతూ.. వారంలోపు తమ ముందు హాజరు కావాలని దునియా విజయ్ కు స్పష్టంచేసింది.

దునియా విజయ్ కి మొదటి భార్య నాగరత్న ఉన్నారు. వారి ఇద్దరికీ మోనిక అనే కూమార్తె ఉంది. ఆమె గతంలో తన తండ్రి అయిన దునియా విజయ్ తనపై చేయి చేసుకున్నాడని మోనిక కేసు పెట్టింది. కానీ మోనిక, తన తల్లి నాగరత్న చెప్పిన విధంగా చేస్తోందని అందుకే నా పై ఆరోపణలు చేస్తూ.. కేసు కూడా పెట్టిందని అప్పట్లో దునియా చెప్పుకొచ్చాడు.

కాగా ప్రస్తుతం తన భర్త రెండవ వివాహం చేసుకుని తనను దూరంగా ఉంచడంతో తమకు జీవనం కష్టమైందని మొదటి భార్య నాగరత్న మహిళా కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు. దాంతో మహిళా కమిషన్‌ స్పందించి విజయ్ కు నోటీసు పంపింది.

తాజా వార్తలు