ఖైదీ కారణంగా దొంగ కి డిమాండ్ పెరిగిందట.

ఖైదీ కారణంగా దొంగ కి డిమాండ్ పెరిగిందట.

Published on Nov 26, 2019 6:41 PM IST

donga

యుగానికి ఒక్కడు, నాపేరు సూర్య, ఆవారా,ఖాకి వంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న తమిళ హీరో కార్తీ ఖైదీ చిత్రంతో ఈసారి గట్టిగా కొట్టాడు. తెలుగు తమిళ భాషలలో విడుదలైన ఈచిత్రం రెండు చోట్ల సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం ఒక రాత్రి నడిచే యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచింది. ఇక తమిళంలో కార్తీ కెరీర్ లో వంద కోట్లు సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది. అలాగే తెలుగులో ఈ మూవీ హక్కులు షుమారు 3.5 కోట్లకు దక్కించుకోగా..,దాదాపు 7కోట్లవరకు రాబట్టి వంద శాతం లాభాలు పంచింది. దీనితో కార్తీ తదుపరి చిత్రం దొంగ కు తెలుగులో పోటీ పెరిగిందట.

ఈ మూవీ తెలుగు హక్కులు సొంతం చేసుకోవాలని కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటికే ప్రయత్నాలు మరియు పైరవీలు మొదలుపెట్టారని వినికిడి. దీనికి తోడు కార్తీ అన్నయ్య సూర్య భార్య అయిన జ్యోతిక ఆయనకు అక్కగా నటిస్తుంది. తమిళంలో ఈ చిత్రం తంబీ పేరుతో విడుదల అవుతుంది. ఇంటిని వదిలిపోయి దొంగగా మారిన హీరో తన అక్కను రక్షించడానికి తిరిగి వచ్చే తమ్ముడిగా కార్తీ నటిస్తున్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తుండగా వచ్చే నెలలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు