మహేష్ బాబును కలిసిన తమిళ్ హీరో !

Published on Feb 13, 2019 3:42 pm IST


మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.

ఇప్పుడు జరుగుతున్న లాంగ్ షెడ్యూల్ తో సినిమా పూర్తి అవుతుందట. కాగా ఈ సినిమా షూటింగ్ లో మహేష్ బాబును స్టార్ నటులు కలుస్తున్నారు.

కన్నడ స్టార్ హీరో శ్రీమురళి మహేష్ బాబును కలిసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తమిళ్ హీరో కార్తీ మహేష్ బాబును సెట్స్ లో కలిశారు. కార్తి నటించిన ‘దేవ్’ రేపు విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :