కార్తీ ప్రయోగాత్మక చీకటి మూవీ “ఖైదీ”

Published on May 18, 2019 9:03 pm IST

తెలుగులో కూడా మార్కెట్ ఉన్న తమిళ్ హీరోస్ లో కార్తీ ఒకరు. కార్తీ నటించిన ప్రతి మూవీ తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. తను చేసిన యుగానికొక్కడు, నా పేరు సూర్య వంటి చిత్రాలు ఆయనకు తెలుగులో కూడా మార్కెట్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం కార్తీ “ఖైదీ” అనే ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళ వెర్షన్ టైటిల్ కాగా తెలుగు వెర్షన్ కి ఇంకా టైటిల్ నిర్ణయించాల్సిఉంది.

ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన లోకేష్ కనగరాజ్..దీనికి సంబందించిన విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమా కథనం మొత్తం రాత్రి పూటే నడుస్తుందని సమాచారం. ఒక్కటంటే ఒక్కటి పగలు షాట్ కనిపించదంట. సందీప్ కిషన్ తో “మానగరం” మూవీని డైరెక్ట్ చేసిన కనగరాజ్ ఈ మూవీకి దర్సకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని కేవలం 62 రోజులో పూర్తి చేసాడట..అది కూడా రాత్రిళ్ళు జరుపడం విశేషం. ఖైదీ టైటిల్ బట్టి చూస్తే హీరో కార్తీ ఈ సినిమాలో ఖైదీ గా నటించివుంటాడనిపిస్తుంది. . మరి ఈ చీకటి మూవీ ప్రేక్షకులను ఎంత వరకు అలరిస్తుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More