తెలుగు దర్శకుడితో కార్తి సినిమా ?

తెలుగు ప్రేక్షకులకు తమిళ హీరో కార్తి కొత్తేమీ కాదు. ఆయన నటించే సినిమాలకు తెలుగునాట కూడ మంచి మార్కెట్ ఉంటుంది. అందుకే ఈసారి ఆయన స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలని భావిస్తున్నారట. అది కూడ ఇటీవలే ‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో కావడం విశేషం.

‘నీది నాది ఒకే కథ’ చిత్రం పట్ల ఇంప్రెస్ అయిన కార్తికి వేణు చెప్పిన స్టోరీ లైన్, అందులో కథానాయకుడి పాత్ర నచ్చి పూర్తిస్థాయి స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్టు, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చేయాలని ఆయన భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజముందో తేలాలంట అధికారిక సమాచారం వెలువడే వరకు వేచి చూడాల్సిందే.