‘కార్తికేయ – 2 ‘కి హీరోయిన్ దొరికింది ?

‘కార్తికేయ – 2 ‘కి హీరోయిన్ దొరికింది ?

Published on Aug 22, 2019 11:07 PM IST

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం చిత్రబృందం ఈ సినిమా హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హిట్ అందుకున్న శృతి శర్మను నిఖిల్ సరసన హీరోయిన్ గా తీసుకున్నారట. ఇప్పటికే పుర్తయిన ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగు ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ రెండో వారం నుండి మొదలెట్టనున్నారు. అలాగే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు మరియు సాంకేతికవర్గానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్ర దర్శకనిర్మాతలు ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు