ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో కార్తికేయ సీక్వెల్ !

Published on May 2, 2019 10:08 am IST

యంగ్ హీరో నిఖిల్ , చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కార్తికేయ’ 2014లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో ఈ చిత్రానికి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వున్న ఈ చిత్రం మే చివర్లో కానీ జూన్ మొదటి వారంలో కానీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఫస్ట్ పార్ట్ లో నటించిన నటీనటులు అందరూ ఈ సీక్వెల్ లో కూడా కనిపించనున్నారు. వీరితోపాటు గా మరో హీరోయిన్ ను తీసుకోనున్నారు.

ఇక ఈ చిత్రం కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందట. దాంతో ఈ చిత్రం ఉత్తరాఖాండ్ , హిమాచల్ ప్రదేశ్ మొదలుగు ప్రాంతల్లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని మళయాలం, హిందీలో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

సంబంధిత సమాచారం :

More