యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ – స్వాతి జంటగా నటించిన ‘కార్తికేయ’ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి మొదటి షో నుంచే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా బాగా నచ్చడం మరియు మౌత్ పబ్లిసిటీతో సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ వీక్ లో థియేటర్స్ ని కూడా పెంచారు. ఈ సినిమా నిఖిల్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయే దిశగా కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.
సినిమా రిలీజ్ అయ్యి ఇది మూడవ వీకెండ్ అయినప్పటికీ ఈ సినిమాకి కలెక్షన్స్ బాగున్నాయి. మొదావ వారం కూడా చాలా చోట్ల మంచి కలెక్షన్స్ వచ్చాయి. నైజాంలో ఇప్పటికే నిఖిల్ కెరీర్ అత్యధిక షేర్ ని సాధించింది. చందు మొండేటి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ కామెడీ థ్రిల్లర్ కి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిచాడు. త్వరలోనే ఈ సినిమా తమిళ వెర్షన్ ని కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
