షూటింగ్ క్యాన్సల్ .. నిర్మాత లాస్ !

Published on Sep 24, 2018 1:46 pm IST


తమిళ హీరో కార్తీ నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘కడైకుట్టి సింగం’ ఇటీవల విడుదలై రికార్డు కలెక్షన్స్ తో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈచిత్రం తెలుగులో ‘చినబాబు’ గా విడుదలై యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. ఇక ఈ చిత్రం తరువాత ప్రస్తుతం కార్తీ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ‘దేవ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ కులుమనాలి లోజరుగుతుంది. అయితే వరదల కారణంగా ఈ రోజు జరగాల్సిన చిత్ర షూటింగ్ రద్దు అయ్యింది. ఈచిత్రానికి పనిచేస్తున్న 140మంది వరదల్లో చిక్కుకుపోయారు. ఇక ఈ చిత్ర షూటింగ్ రద్దు కావడంతో చిత్ర నిర్మాత కు రూ.1.5 కోట్ల నష్టం వచ్చిందట. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ పతాకం ఫై లక్ష్మణ్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :