హిట్ సినిమా సీక్వెల్ ఆగిపోలేదు.. త్వరలోనే

Published on May 26, 2021 10:32 pm IST

గతేడాది ఆఖరులో విడుదలైన తమిళ చిత్రం ‘ఖైదీ’ భారీ విజయాన్ని అందుకుంది. కార్తీ ఈ చిత్రంలో హీరో. తెలుగులో కూడా సినిమా మంచి ఫలితాన్ని రాబట్టింది. హీరోయిన్, పాటలు లాంటి రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధించడం, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇంటెన్స్ టేకింగ్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది. సినిమా చివర్లో సీక్వెల్ ఉంటుందని అప్పుడే హింట్ ఇచ్చారు. కానీ ఆతర్వాత లాక్ డౌన్ రావడం, కార్తీ, లోకేష్ కనగరాజ్ ఇద్దరూ సినిమాలతో బిజీ అయిపోవడంతో సీక్వెల్ పనులకు బ్రేక్ పడింది.

దీంతో అసలు సీక్వెక్ ఉంటుందా లేదా అనే అనుమానం మొదలైంది ప్రేక్షకుల్లో. తాజాగా చిత్ర నిర్మాత ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ సీక్వెల్ తప్పకుండా ఉంటుందని అన్నారు. ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్ఛారు. ‘ఖైదీ’లో జైలు నుండి విడుదలైన ఢిల్లీ పోలీసులను ఎలా కాపాడాడు అనేది కథ అయితే అసలు జైలుకు వెళ్లకముందు ఢిల్లీ జీవితం ఏమిటి, ఏం చేసి అతను జైలుకి వెళ్ళాడు, ప్రతినాయకుడిగా, ఢిల్లీకి ఉన్న లింకేంటి అనేదే సీక్వెల్ కథ. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కమల్ హాసన్ చిత్రం చేస్తూ ఆతర్వాత విజయ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ రెండూ కంప్లీట్ అయిన తర్వాత ‘ఖైదీ 2’ పట్టాలెక్కవచ్చు.

సంబంధిత సమాచారం :