ఇబ్బందుల్లో పడ్డ కార్తీ మూవీ

ఇబ్బందుల్లో పడ్డ కార్తీ మూవీ

Published on Sep 28, 2014 12:10 PM IST

Madras

తమిళంతో పాటు తెలుగులో కూడా సమాన క్రేజ్ ఉన్న తమిళ హీరో కార్తీ నటించిన ‘మద్రాస్’ సినిమా గత శుక్రవారం విడుదలైంది. మొదటి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని సూపర్ హిట్ మూవీ అని బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేస్తోంది. కానీ తాజాగా నిన్న నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జైలుకు వెళ్ళిన కారణంగా జరుగుతున్న పలు పరిణామాల దృష్ట్యా ఈ సినిమాపై ఎఫెక్ట్ పడుతోంది.

ఇప్పటికే పలు చోట్ల షోస్ కాన్సల్ చేయడంతో ఈ సినిమా కలెక్షన్స్ పై బాగా ఎఫెక్ట్ పడుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇదే వరస మరో 10 రోజులు కొనసాగే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. కార్తీ గత సినిమాలు పెద్దగా ఆడలేదు, ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినా ఇలా జరగడంతో ఈ చిత్ర టీం ఇబ్బందుల్లో పడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు