ఈ యేడాది ఇంకో సినిమాతో పలకరించనున్న కార్తి

Published on Nov 8, 2019 3:00 am IST

ఇటీవలే ‘ఖైథి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు హీరో కార్తి. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయోత్సాహంతో ఇదే యేడాది ఇంకో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అయ్యారు కార్తి. ఈ చిత్రంలో కార్తితో పాటు అయన సోదరుడు సూర్య సతీమణి, నటి జ్యోతిక కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది.

డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నట్టు తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. క్రైమ్ థిల్లర్ కామెడీ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘తంబి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను వియకామ్ 18 స్టూడియోస్, పారలల్ మైండ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సత్యరాజ్, నిఖిల విమల్, అమ్ము అభిరామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఖైదీ’ చిత్రం తెలుగులో మంచి హిట్ అయినందు వలన ఈ సినిమాను కూడా తెలుగులోకి భారీ ఎత్తున డబ్ చేసే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More