ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన ‘సుల్తాన్’ హక్కులు

Published on Feb 24, 2021 2:11 am IST

తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన గత సినిమాలు ‘ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఊపిరి, ఖైదీ’ సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం కార్తీ ‘సుల్తాన్’ సినిమా చేస్తున్నారు. ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు కార్తీ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం ఇదే. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా మాస్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.

ఈ హైప్ కారణంగా సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులు మంచి ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆంధ్రా, నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ హక్కుల ధర రూ. 7 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండటం, ట్రెండింగ్ హీరోయిన్ రష్మిక మందన్న కథానాయిక కావడం సినిమాకు కలిసొచ్చే అంశాలు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :