ఓటీటీలో ‘సుల్తాన్’.. ఎప్పుడంటే..

Published on Apr 21, 2021 9:32 pm IST

సినిమా థియేటర్లు మూతబడుతున్నాయి. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో హాళ్లు నడుస్తుంటే తెలంగాణలో ఈ నెలాఖరు వరకు మూతబడ్డాయి. ‘వకీల్ సాబ్’ ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్లు మినహా మిగతా హాళ్ళన్నీ ఇదే క్లోజ్ అయ్యాయి. చెప్పాలంటే రెండు రాష్ట్రాల్లో థియేటర్లలో ఒక్క పవన్ సినిమానే ఉంది. రీసెంట్ రిలీజెస్ ఏవీ కూడ లేవు. ఇక థియేటర్లలో లేదు అంటే వెంటనే ఓటీటీలోకే కదా రావాల్సింది. కార్తీ ‘సుల్తాన్’ చిత్రం అదే బాట పట్టింది.

ఏప్రిల్ 2న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రాన్ని ఓటీటీలోకి వదలాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. మే 2వ తేదీన తమిళ వెర్షన్ డిస్నీ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానుండగా తెలుగు వెర్షన్ అదే రోజున ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి రెమో ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. ఈ సినిమాలో కార్తీకి జంటగా క్రేజీ హీరోయిన్ రష్మిక మందన నటించింది.

సంబంధిత సమాచారం :