సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్, స్టార్ ఇమేజ్ తన సొంతం అని ఇళయ దళపతి విజయ్ మరోసారి నిరూపించాడు. విజయ్ నటించిన ‘కత్తి’ సినిమా సరికొత్త రికార్డులను లిఖిస్తుంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా కేవలం 12 రోజులలో 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సౌత్ లో అతి తక్కువ రోజుల్లో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది. ఇండియాలో 80.5 కోట్లు. ఓవర్సీస్ లో 20.2 కోట్లు వసూలు చేసినట్టు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ట్విట్టర్ లో తెలిపారు. సౌత్ ఇండియాలో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా రికార్డు కూడా ‘కత్తి’దే కావడం విశేషం. ఈ సినిమాలో సమంత హీరోయిన్. తమిళంలో ఆమెకి లభించిన ఫస్ట్ హిట్ & బ్లాక్ బస్టర్ సినిమా.
త్వరలో ‘కత్తి’ సినిమాను తెలుగులో నవంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఠాగూర్ మధు డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. యువ సంగీత సంచలనం, ‘కొలవేరి డి’ ఫేం అనిరుధ్ కంపోజ్ చేసిన ఆడియోను త్వరలో విడుదల చేయనున్నారు.


