బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతుంది. పెళ్లి, ఆ తర్వాత తల్లి కావడంతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబానికే పరిమితమైన కత్రినా.. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం కథలు వినడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఈసారి ఆమె కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టనుందట. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో కూడిన వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ఒరిజినల్స్ చేయడానికి ఆమె ఆసక్తి చూపిస్తున్నట్లు బిటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆఖరిలోగా ఆమె చేయబోయే ప్రాజెక్టులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక వచ్చే ఏడాది నుండి కత్రినా కైఫ్ మళ్లీ షూటింగ్‌లలో పాల్గొననుందట. ఆమె చివరగా 2024లో విజయ్ సేతుపతి సరసన ‘మేరీ క్రిస్మస్’ చిత్రంలో కనిపించింది. భర్త విక్కీ కౌశల్‌తో కలిసి బాబు ‘విహాన్’ సంరక్షణలో బిజీగా ఉన్న ఈ స్టార్ బ్యూటీ.. సరికొత్త ప్రాజెక్టులతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.


