కవచం హిందీ వెర్షన్ యూట్యూబ్ లో అదరగొడుతుంది !

Published on Apr 30, 2019 10:21 am IST

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా నటించిన చిత్రం కవచం. గత ఏడాది చివర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే తాజాగా ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ యూట్యూబ్ లో విడులదై మంచి వ్యూస్ ను రాబడుతుంది. ఇన్స్పెక్టర్ విజయ్ అనే టైటిల్ తో విడుదలైన ఈ డబ్బింగ్ వెర్షన్ 24గంటల్లో 16మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకుంది.

నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మెహ్రీన్ మరో కథానాయిగా నటించగా బాలీవుడ్ నటుడు నిల్ నితిన్ ముఖేష్,విలన్ పాత్రలో నటించాడు. వంశధార క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :