సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కవచం’ !

Published on Dec 3, 2018 7:33 pm IST

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కవచం’. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సిద్ధంగా ఉంది.

కాగా ప్రస్తుతం చిత్రబృందం ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది. నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా బాలీవుడ్ నటుడు నిల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు.

తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :