బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన 5వ చిత్రం ‘కవచం’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు ప్రోమోస్ చూస్తుంటే.. ఈ చిత్రం ఒక యాక్షన్ ప్యాకెడ్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు చేసిన నాలుగు చిత్రాల్లో భారీ తారాగణంతో మరియు భారీ బడ్జెక్టుతో వచ్చినప్పటికి.. బెల్లంకొండకు మాత్రం ఆ రేంజ్ భారీ హిట్ దక్కలేదు. మరి కవచం అన్నా ఆ లోటు తీరుస్తోందేమో చూడాలి.
తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మంచి కంటెంట్ తో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. నిల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి గా అజయ్, హరీష్ ఉత్తమ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్నినూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కించారు.
తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కాజల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. వంశధార క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదల కానుంది.


