ఫిల్మ్ సిటీలో ప్రధముడిగా కృష్ణని కెసిఆర్

ఫిల్మ్ సిటీలో ప్రధముడిగా కృష్ణని కెసిఆర్

Published on Sep 28, 2014 11:04 AM IST

krishna
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలో ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్లాన్ ప్రకారం హైదరాబాద్ నగర శివార్లలో సుమారు 4 నుంచి 5 వేల ఎకరాల భూమిని ఇచ్చి, అక్కడ ఓ భారీ ఫిల్మ్ సిటీని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సరికొత్త ఫిల్మ్ సిటీ కోసం ఉండే బోర్డ్ డైరెక్టర్స్ ఒకరిగా విలక్షణ నటుడు సూపర్ స్టార్ కృష్ణని కెసిఆర్ ఎంచుకున్నారు. కెసిఆర్ తీసుకున్న ఈ స్టెప్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అలాగే కృష్ణ గారు కూడా ఎప్పుడు పబ్లిక్ గా కెసిఆర్ ని ప్రశంశించలేదు కదా మరి ఈ . ఈ ఫిల్మ్ సిటీ స్టెప్ ఏమిటా అని అభిమానులు షాక్ అయ్యారు. ఈ సరికొత్త ఫిల్మ్ సిటీ ఎక్కడ నిర్మిస్తారు, మిగిలిన విషయాలను త్వరలోనే తెలియజేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు