‘రుద్రమదేవి’ కెసిఆర్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్

‘రుద్రమదేవి’ కెసిఆర్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్

Published on Oct 8, 2015 4:16 PM IST

kcr1
భారీ బడ్జెట్ మరియు భారీ సెట్స్ స్పెషలిస్ట్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్ట మొదటి స్టీరియో స్కోపిక్ 3డి పీరియాడిక్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మరి కొద్ది గంటల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి తెలంగాణ ముఖ్య మంత్రి తనవైపు నుంచి కూడా సపోర్ట్ ఇచ్చాడు. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ టాక్స్ మినహాయింపు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని కలిసారు.

ఆయన కూడా వెంటనే దానికి ఓకే చెప్పి రుద్రమదేవి సినిమాకి తెలంగాణ రీజియన్ లో ఎంటర్టైన్మెంట్ టాక్స్ ని ఎత్తి వేసారు. దీనివల్ల గుణశేఖర్ కాస్త రిలీఫ్ అయ్యాడు. అనుష్క రుద్రమదేవిగా కనిపించనున్న ఈ సినిమాలో చాళుక్యవీరభద్రుడిగా రానా కనిపిస్తాడు. అలాగే అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో కనిపిస్తాడు. ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి తోట తరణి అద్భుతమైన అలనాటి కట్టడాలని సెట్స్ గా రూపకల్పన చేసారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ హిస్టారికల్ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది చూడాలి.

తాజా వార్తలు