రజిని మూవీలో ఛాన్స్…ఉబ్బితబ్బిబ్బవుతున్న హీరోయిన్..!

Published on Dec 10, 2019 10:03 am IST

మహానటి తరువాత బ్యూటీ కీర్తి సురేష్ కెరీర్ ఊపందుకుంది. ప్రస్తుతం వివిధ భాషలలో ఆమె అరడజను సినిమాలవరకు చేస్తుంది. వీటిలో దాదాపు నాలుగు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కావడం విశేషం. ఇక తెలుగులో మిస్ ఇండియా అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో పాటు నితిన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రంగ్ దే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా సోషల్ మీడియా ద్వారా ఆమె నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించింది. ఆమె ఏకంగా తలైవా రజినీకాంత్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది.

ప్రస్తుతం రజిని స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చేస్తున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా మాస్ చిత్రాల దర్శకుడు శివ తో రజిని తన 168వ చిత్రం చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకివెళ్ళనుంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపిక కబడ్డారట. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వీడియో ద్వారా ప్రత్యక్షంగా అభిమానులతో పంచుకున్న కీర్తి సురేష్ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. నేను రజిని కి పెద్ద ఫ్యాన్ అని, ఆయన పక్కన నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని, కీర్తి తెలిపారు.

సంబంధిత సమాచారం :

More