వైరల్: మహేశ్ విషయంలో నమ్రతకు కీర్తిసురేశ్ సజేషన్..!

Published on Aug 10, 2021 12:56 am IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు విషయంలో భార్య నమ్రతకు హీరోయిన్ కీర్తిసురేశ్ ఓ సజేషన్ ఇచ్చింది. నమ్రతా మేడమ్.. మహేశ్ సర్ పడుకునే ముందు ప్రతిరోజూ దిష్టి తీయడం మర్చిపోకండి అని కీర్తిసురేశ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న “సర్కారు వారి పాట” నుంచి బర్త్ డే బ్లాస్టర్‌గా నేడు టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.

ఇందులో మహేశ్ మరింత స్టైలిష్‌గా, యంగ్ లుక్‌లో కనిపించి తనదైన శైలిలో డైలాగ్స్ చెబుతూ, యాక్షన్ సన్నివేశాల్లో దుమ్ముదులిపేశాడు. ఇది పక్కన పెడితే కీర్తిసురేశ్ మహేశ్‌కు దిష్టి తీస్తూ ఇందులో ఓ డైలాగ్‌ని చెప్పింది. అయితే ఆ డైలాగ్‌నే కీర్తి సురేశ్ తన ట్వీట్ ద్వారా మహేశ్ భార్య నమ్రతకు చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :