ఈ స్టార్ హీరోయిన్ డైరెక్షన్ చేస్తానంటుంది !

Published on Oct 21, 2018 2:51 pm IST

మహానటి చిత్రంలో అచ్చం మహానటి సావిత్రిలా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ కీర్తీసురేశ్‌. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోంది. కాగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తన కెరీర్ కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. తనకు దర్శకురాలిగా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యం ఉందని.. తానెప్పుడూ మంచి కథ, కథనాల గురించి ఆలోచిస్తానని… వీలైనప్పుడల్లా తాను డైరెక్ట్ చెయ్యబోయే సినిమా కోసం స్క్రిప్ట్ రాసుకుంటుంటానని చెప్పుకొచ్చింది కీర్తీ సురేష్. అయితే భవిష్యత్తులో తప్పకుండా దర్శకురాలిని అవుతానని కీర్తీ స్పష్టంగా చెప్పడం విశేషం.

ఇక ఇటీవలే లింగుస్వామి దర్శకత్వంలో కీర్తీ సురేశ్‌, విశాల్ తో కలిసి చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పందెంకోడి 2’ చిత్రం. ఈ చిత్రం విడుదలై మిక్స్ డ్ రివ్యూస్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో కీర్తీ సురేశ్‌ పాత్ర చాలా అల్లరిగా సరదాగా సాగుతూ ఎంటర్ టైన్ చేస్తోంది.

సంబంధిత సమాచారం :