ఆ సైకోలని వేటాడి, శిక్షించాలి-కీర్తి సురేష్

ఆ సైకోలని వేటాడి, శిక్షించాలి-కీర్తి సురేష్

Published on Nov 29, 2019 4:10 PM IST

keerthi

హైదరాబాద్ నగరంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని కొందరు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, తగులబెట్టిన ఘటన అందరినీ కలచివేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని సామాన్యుల నుండి సెలబ్రిటీలు, రాజకీయనేతల వరకు అందరూ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ దారుణంపై స్పందించిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సైతం తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.

ప్రియాంక రెడ్డి హత్య ఉదంతం విన్నాక గుండె పగిలినంత పనైందన్న ఆమె పరిస్తితులు రోజురోజుకూ భయానకంగా తయారయ్యాయి. సూపర్ సేఫ్ సిటీలోనే ఇలాంటి దారుణం జరిగిందంటే ఎవరిని నిందించాలి. ఈ దారుణానికి పాల్పడిన క్రూరులని వేటాడి శిక్షించాలి. ప్రియాంక కుటుంభ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నాను. వారు త్వరగా కోలుకుని నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించాలి అంటూ భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు