సందేహాలను నివృత్తి చేసిన కీర్తి సురేష్ !

భారతీయ సినీ రంగంలో మహానటి సావిత్రిగారిది ప్రత్యేకమైన స్థానం. అందం, అభినయంతో పాటు అంతులేని చరీష్మ కలిగిన ఆమె స్థానాన్ని భర్తీ చేసే నటీమణి మరొకరులేరు. అంతటి గొప్ప నటి జీవితం ఆధారంగా ‘మహానటి’ పేరుతో సినిమాను రూపొందిస్తున్నారు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. ఇందులో సావిత్రిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది.

ప్రాజెక్ట్ మొదలైన దగ్గర్నుండి చాలా మంది నటన పరంగా, ఆహార్యం పరంగా కీర్తి సురేష్ సావిత్రి పాత్రకు న్యాయం చేయగలదా లేదా అనే సందేహాన్ని వెలిబుచ్చారు. చిత్ర యూనిట్ కూడ వాళ్ళలో క్యూరియాసిటీని పెంచుతూ సెట్స్ నుండి సావిత్రి లుక్ లో ఉన్న కీర్తి సురేష్ ఫోటోలేవీ బయటకు రాకుండా చూసి ఎట్టకేలకు ఈరోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ఆ ఫస్ట్ లుక్ ను చూస్తే అందులో ఉన్నది నిజంగా సావిత్రిగారేనేమో అనిపిస్తూ కీర్తి సురేష్ తప్పకుండా పాత్రకు న్యాయం చేసుంటారనే నమ్మకం కలుగుతోంది. ఇకపోతే చిత్ర టీజర్ సైతం ఈ రోజే విడుదలకానుండగా సినిమా మే 9న విడుదలకానుంది.