కొత్త లుక్ తో షాక్ ఇచ్చిన కీర్తి సురేష్ !

Published on May 22, 2021 6:00 pm IST

హీరోయిన్ ‘కీర్తి సురేష్’ ఈ మధ్య డైట్‌ చేసి మొత్తానికి బాగా సన్నబడింది. నిజానికి ఆమె గత సినిమా ‘రంగేదే’లోనే కీర్తి లుక్ ఆమె అభిమానులకు నచ్చలేదు. ‘కీర్తి సురేష్ కి ఏమైంది ? ఆమెకు సన్నబడాల్సిన అవసరం ఏముంది ? మీరు బొద్దుగా ఉంటేనే బాగుంటారు’ అంటూ ఆమెకే కామెంట్స్ చేసి తమ అసంతృప్తిని వ్యక్త పరిచారు కీర్తి సురేష్ అభిమానులు. ఎలాగూ తన స్లిమ్ లుక్ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి కాబట్టి, ఇక కీర్తి సన్నబడటానికి ట్రై చేయదు అనుకున్నారు అంతా.

అయితే, తాజాగా కీర్తి తన కొత్త లుక్ తో తన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చింది. కీర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ‘నిశ్శబ్దం, యోగా నా డైలీ వర్కౌట్స్ లో భాగమైయాయి’ అంటూ మెసేజ్ కూడా పెట్టింది. కాగా ఆ వీడియోలో కీర్తి సురేష్ లుక్ ను చూసిన ఆమె అభిమానులు మరోసారి తీవ్ర నిరాశకి గురి అయ్యారు. వీడియోలో బాగా సన్నగా కనిపిస్తోన్న కీర్తిని చూడలేక, ‘మీకు ఏమైంది. ఎందుకు మరీ ఇంతగా సన్నబడ్డారు, ఇంతగా లుక్ మార్చడం దేనికి ?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :