సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించిన కీర్తి సురేశ్..!

Published on Jan 26, 2022 10:00 pm IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సొంత యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ ఈ రోజు నా అధికారిక యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, అభిమానులు మరియు ప్రేక్షకులు మరిన్ని అప్డేట్ల కోసం తన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరింది.

ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ చిత్రం ‘గుడ్ లక్ సఖి’. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ నెల 28న థియేటర్లలో విడుదల కానుంది. ఇక మహేశ్ బాబు సరసన నటించిన “సర్కారు వారు పాట” ఏప్రిల్ 1న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :