మాసివ్ రికార్డు ను సెట్ చేసిన కీర్తి సురేష్ “మిస్ ఇండియా”

Published on Jul 7, 2021 8:45 pm IST

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం మిస్ ఇండియా. కీర్తి సురేష్ ఇప్పటికే పలు ఛాలెంజింగ్ రోల్స్ చేసి తనేంటో నిరూపించుకున్నారు. అయితే ఈ చిత్రం విడుదల అయి ఏడాది అవుతోంది. అయితే ఈ చిత్రం హిందీ లో తాజాగా యూ ట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. కేవలం రెండు రోజుల్లో 25 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే బాలీవుడ్ నాట సౌత్ సినిమాలకు చాలా క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. మరొకసారి కీర్తి సురేష్ మిస్ ఇండియా చిత్రం తో మరొకసారి అది ఋజువు అయ్యింది. మహేష్ కోనేరు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించారు. ఈ చిత్రం హిందీ లో పాజిటివ్ టాక్ రావడం తో ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :