కీర్తి తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది !

Published on Apr 27, 2019 10:50 pm IST

మహానటి తరువాత తెలుగులో సినిమాలు చేయడం తగ్గించేసింది రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్. కేవలం కథా భలం వున్నా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం నరేంద్ర దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దసరా కు ఈసినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తో పాటు ఇప్పుడు మరో తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కీర్తి. ఈ చిత్రానికి అవార్డు విన్నింగ్ బాలీవుడ్ డైరెక్టర్ ,’హైదరాబాద్ బ్లూస్,ఇక్బాల్’ ఫేమ్ నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమాలో కీర్తి తోపాటు జగపతి బాబు , ఆది పినిశెట్టి , రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ లో నటించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. సుధీర్ చంద్ర నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదలకానుంది. ఈ చిత్రం యొక్క షూటింగ్ వికారాబాద్ , పూణే లో జరుగనుంది.

సంబంధిత సమాచారం :