కీర్తి సురేష్.. ఈ స్పీడేమిటి !

Published on Feb 27, 2021 3:00 am IST

దక్షిణాది స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది కీర్తి. చేస్తున్నవే కాకుండా కొత్త సినిమాలను కూడ మొదలుపెడుతోంది ఆమె. రజినీకాంత్ యొక్క ‘అన్నాత్తే’ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్న కీర్తి పరశురామ్ మహేష్ బాబుల ‘సర్కారువారి పాట’లో కథానాయకిగా నటిస్తోంది. ఈ రెండూ సెట్స్ మీదున్నాయి. అలాగే నితిన్ తో కలిసి చేసిన ‘రంగ్ దే’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.

ఇవన్నీ కాకుండా ఆమె తన కొత్త సినిమా ‘సాని కాయిదం’ షూటింగ్ కూడ మొదలైంది. చూడబోతే ఈ ఏడాదిలో కీర్తి నుండి రెండు సినిమాలు పక్కాగా వచ్చేలా ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారానే ఆసక్తి రేపింది ఈ ప్రాజెక్ట్. ఇందులో కీర్తితో పాటు ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ కూడ నటిస్తున్నారు. నటుడిగా ఇదే ఆయనకు మొదటి సినిమా. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. 1980లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

సంబంధిత సమాచారం :