ఈ సినిమా తన బర్త్‌ డే గిఫ్ట్‌ అంటున్న మహానటి !

ఈ సినిమా తన బర్త్‌ డే గిఫ్ట్‌ అంటున్న మహానటి !

Published on Oct 17, 2018 8:39 AM IST


మహానటి చిత్రంలో అచ్చం మహానటి సావిత్రిలా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ కీర్తీసురేశ్‌. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తీ నేడు తన 27వ పుట్టినరోజు జరుపుకొనున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.. ఈ పుట్టిన రోజు తనకు ఎంతో ప్రత్యేకమైనదని… 2018 ని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని.. ఈ సంవత్సరం నాకు మంచి విజయాలను అందించిందని ఆమె తెలిపారు. ఇక కీర్తి నటించిన ‘పందెంకోడి 2’ చిత్రం రేపు రిలీజ్‌ అవుతోంది. ఈ చిత్రం ద్వారా తనకు మళ్ళీ మరో విజయం రానుందని.. నాకు ఆల్రెడీ బర్త్‌డే గిఫ్ట్‌ ఈ సినిమా ద్వారా ఓ రోజు ముందు లభించినట్లే అని ఆమె తెలిపింది. కీర్తీ ఇంకా మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రాకముందు నా బర్త్‌డేని ఎప్పుడూ ఫ్రెండ్స్‌తోనే జరుపుకునేదాన్ని. అలాగే ఈ పుట్టినరోజు కూడా ఫ్రెండ్స్‌తోనే జరుపుకుంటానని అన్నారు.

విశాల్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘పందెంకోడి 2’లో కీర్తీ సురేశ్‌ కథానాయిక నటించారు. ఆమె పాత్ర చాలా అల్లరిగా సరదాగా ఉంటుందట. పందెంకోడి 2 చిత్ర తెలుగు హక్కులను భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు.. విజయదశమి కానుకగా అక్టోబర్ 18న ఈ చిత్రాన్ని
తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు