సూపర్ స్టార్ సరసన కీర్తి సురేష్.. నిజంగా గోల్డెన్ ఛాన్స్

Published on Dec 9, 2019 11:40 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో శివ దర్శకత్వంలో కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో రజనీ సరసన కథానాయికగా మీనా, ఖుష్బూ లాంటి నటీమణుల పేర్లు వినబడినా చివరికి యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ ఫైనల్ అయింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

రజనీ సరసన కీర్తి సురేష్ నటించడం ఇదే తొలిసారి. ఇది నిజంగా ఆమెకు గొప్ప అవకాశమనే అనాలి. కీర్తి సైతం ఈ అవకాశం రావడం పట్ల చాలా ఎగ్జైట్ అవుతోంది. రజనీ సార్ సినిమాలో ఆయన పక్కన నటించడం నా జీవితంలోనే మధురమైన, గొప్ప అనుభూతి అంటూ డైరెక్టర్ శివకు కృతఙ్ఞతలు తెలుపుకుంటోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :

More