లాంగ్ షెడ్యూల్ కోసం కీర్తి సురేష్.. ఐరోపాకు !

Published on May 3, 2019 3:30 pm IST

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో నరేంద్ర అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ నెల తరువాత 45 రోజుల పాటు జరిగే లాంగ్ షెడ్యూల్ కోసం కీర్తి సురేష్ తో పాటు చిత్రబృందం మొత్తం ఐరోపాకు వెళ్లనుంది.

కాగా మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రాకంగా దాడుల జరుగుతాయి. ఆ దాడులని ఈ చిత్రంలో విశ్లేషాత్మకంగా చూపించనున్నారని తెలుస్తోంది. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కీర్తి సురేష్.. మరి ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కూడా ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More