‘మిస్ ఇండియా’గా కీర్తి సురేష్ ?

Published on Aug 7, 2019 8:12 pm IST

నరేంద్ర అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘మిస్ ఇండియా’ అనే టైటిల్ ను చిత్రబృందం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే టైటిల్ కి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

కాగా మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రాకంగా దాడుల జరుగుతాయి. ఆ దాడులని ఈ చిత్రంలో విశ్లేషాత్మకంగా చూపించనున్నారని సమాచారం. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కీర్తి సురేష్.. మరి ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కూడా ప్రేక్షకుల ముంమనసును గెలుసుకుంటుందేమో చూడాలి.

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో నరేష్, నదియా, రాజేంద్రప్రసాద్, కమల్ కమారాజు, భానుశ్రీ మెహ్రా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :