చిన్న సినిమాలకు అండగా కేరళ ప్రభుత్వం సరికొత్త ఓటిటి!

Published on Jul 2, 2021 8:12 pm IST


కరోనా వైరస్ మహమ్మారి దేశం లో అడుగుపెట్టినప్పటి నుంచి సినీ పరిశ్రమ కి భారీ నష్టం వాటిల్లింది అని చెప్పాలి. అయితే చిన్న చిన్న సినిమాలకు ఆ నష్టం ఇంకా ఎక్కువే అయింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఓటిటి హవా నడుస్తుంది. అయితే చిన్న చిత్రాలకు మద్దతు ఇవ్వడానికి కేరళ ప్రభుత్వం ఒక సరికొత్త ఆలోచన చేయడం జరిగింది. చిన్న సినిమాలకు అండగా ఉండేందుకు కేరళ ప్రభుత్వమే ఓటిటి ను ప్రారంభించడం జరుగుతోంది. అయితే దీని పై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం పట్ల పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ను సైతం ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ నిర్ణయం చిన్న సినిమాలు చేసే నిర్మాతలకు, నటులకు, దర్శకులకు అండగా ఉంటుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :