దిల్ రాజు ‘కేరింత’ ఆడియో రిలీజ్ డేట్

దిల్ రాజు ‘కేరింత’ ఆడియో రిలీజ్ డేట్

Published on Apr 14, 2015 1:12 PM IST

kerinta
ఎంతో మంది కొత్తవాళ్ళకి అవకాశం ఇచ్చి కమర్షియల్ గా సక్సెస్ లు అందుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం లో బడ్జెట్ లో చేస్తున్న సినిమా ‘కేరింత’. ‘వినాయకుడు’ ఫేం సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, తేజస్వి, అవంతిక జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఈ చిత్ర టీం ప్రమోషన్స్ లో భాగంగా మొదటి సాంగ్ ని కూడా రిలీజ్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ 25న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

కాలేజీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రషెస్ చూసిన మూవీ యూనిట్ సభ్యులు చాలా సంతోషంగా ఉండడమే కాకుండా సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే దీమాను వ్యక్తం చేశారు.

అబ్బూరి రవి ఈ సినిమాకి కథా సహకారం అందిచడమే కాకుద్నా మాటల రచయితగా కూడా పనిచేసాడు. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మిక్కి యూత్ ఫుల్ బాణీలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని సమాచారం.

తాజా వార్తలు