కీలక షెడ్యూల్ కి సిద్దమవుతున్న ‘బాహుబలి’ టీం

కీలక షెడ్యూల్ కి సిద్దమవుతున్న ‘బాహుబలి’ టీం

Published on Sep 10, 2014 11:11 AM IST

bahubali-first-look
సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా అన్నదమ్ములుగా నటిస్తున్న అంత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్ర టీం ఎక్కడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకి చాలా కీలకమైన పార్ట్ కి సంబందించిన న్యూ షెడ్యూల్ ని ఈ వారం అనగా 12వ తేదీ నుంచి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించనున్నారు.

ఇప్పటికే ఈ చిత్ర టీం ఈ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ ని కూడా రూపొందించారు. నిన్ననే ఈ చిత్ర టీం మహాబలేశ్వర్ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. అక్కడ ప్రభాస్ – తమన్నాలపై ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసారు. ఈ షెడ్యూల్ కి ముందు రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఓ లాంగ్ షెడ్యూల్ ని ఫినిష్ చేసారు.

యోగ బ్యూటీ అనుష్క, మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇంటర్నేషనల్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో సుమారు 170 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు. రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ని 2015 ఏప్రిల్ 17న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు