‘కెజిఎఫ్ 2’ ముగింపు.. హైదరాబాద్లోనే !

Published on Jan 28, 2020 6:53 am IST

కన్నడ స్టార్ హీరో యాష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కెజిఎఫ్’ చిత్రం అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని సాదించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో రెండవ భాగం ‘కెజిఎఫ్ 2’ పై అన్ని పరిశ్రమల్లో అమితాశక్తి నెలకొంది. ఈ అంచనాలను అందుకోవడానికి నిర్మాతలు ద్వితీయ భాగాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ పార్ట్ కుసంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాగే ప్రతి సీన్ లో ఎమోషన్ కూడా హైలైట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం ఈ సినిమా షూట్ మైసూర్ ప్రాంతంలో జరుగుతోంది. అది ముగియగానే ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ భారీ షెడ్యూల్ తర్వాత చిత్రీకరణ పూర్తవుతుందట. ఈ రెండవ భాగం గురించి గతంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ సెకండ్ పార్టీ ఇంకా హెవీ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుందని, వరల్డ్ మాఫియాను భారీ స్థాయిలో చూపించడం జరుగుతుందని అన్నారు. ఇందులో ప్రధాన ప్రటినాయకుడి పాత్రలో సంజయ్ దత్ నటిస్తుండగా ఇంకొందరు ఇతర భాషల నటీ నటులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :