ఆ బ్యానర్ లో భారీ ధరకు “కేజీయఫ్ 2” తమిళ్ రైట్స్.!

Published on Jul 7, 2021 5:30 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం భారతదేశ వ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. అలాగే ఈ భారీ చిత్రం విడుదలపై కూడా మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ సినిమా బిజినెస్ వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే.. అలా ఇప్పుడు ఈ సినిమా తమిళ హక్కులకు సంబంధించి టాక్ తెలుస్తుంది. అక్కడ ఈ సినిమా డబ్బింగ్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ గ్రీన్ స్టూడియోస్ వారు భారీ ధరకు కొనుగోలు చేశారట.

అయితే ఫిగర్ ఎంత అన్నది క్లారిటీ లేదు కానీ అక్కడ డబ్బింగ్ సినిమాల్లో కేజీయఫ్ 2 కూడా టాప్ లో ఉందని తెలుస్తుంది. ఇక ఈ సాలిడ్ చిత్రంలో అధీరా గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండగా ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :