కేజీఎఫ్ చాప్టర్2 సౌత్ ఆడియో రైట్స్ ఎంతంటే?

Published on Jul 1, 2021 5:19 pm IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం కేవలం సౌత్ నాట మాత్రమే కాకుండా, ఇండియా లోని మిగతా భాషల్లో కూడా విడుదల అయి సంచలనం సృష్టించింది. అయితే ఈ చిత్రానికి కొనసాగింపు వస్తున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కి సంబందించిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 సౌత్ ఇండియా ఆడియో రైట్స్ ను 7.2 కోట్ల రూపాయల కి గాను లహరి మ్యూజిక్ మరియు టి సీరిస్ కి చిత్ర యూనిట్ అమ్మేసింది.

అయితే యశ్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల అయ్యేందుకు సిద్దం అవుతుంది. కరోనా వైరస్ కారణంగా పలు చిత్రాల విడుదల ఇప్పటికే వాయిదా పడ్డాయి. అయితే అనుకున్న సమయానికి కేజీఎఫ్ చాప్టర్ 2 వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :