“పుష్ప 1” స్ట్రామ్ కన్నా ముందే “కేజీయఫ్ 2”..డేట్ ఇదేనా.?

Published on Aug 5, 2021 11:30 pm IST

ఈ ఏడాది పరిస్థితులు కనుక ఇంకాస్త మెరుగైతే భారీ పాన్ ఇండియన్ సినిమాలు కూడా రిలీజ్ కి డెఫినెట్ గా రానున్నాయి. వాటిలో ఆల్రెడీ భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” అక్టోబర్ రిలీజ్ కి లాక్ కాగా.. మరిన్ని పాన్ ఇండియన్ చిత్రాలు రిలీజ్ కి సిద్ధం అవుతుండగా మొన్ననే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం పుష్ప పార్ట్ 1 ఈ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

దీనితో మరో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” రిలీజ్ డేట్ ఎప్పుడు అనే చర్చ చాలా రసవత్తరంగా నడుస్తుంది. రాకింగ్ స్టార్ యష్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ ల కాంబోలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం రిలీజ్ ఎప్పుడు అని ఆసక్తిగా మారగా ఇదే డిసెంబర్ నెలలో ఈ చిత్రం ఉంటుంది అని బజ్ నడుస్తుంది. మరి లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ చిత్రం రిలీజ్ పుష్ప పార్ట్ 1 కన్నా ముందే డిసెంబర్ 20న ఉండొచ్చని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత మేర నిజం అన్నది ఇంకా వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :