“సలార్” స్పెషల్ సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ ?

“సలార్” స్పెషల్ సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ ?

Published on May 2, 2021 10:00 PM IST

యాక్షన్ డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ – నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న “సలార్”లో ఒక ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. కాగా ఆ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీనిధి శెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో షూట్ చేస్తారట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీలో హీరోయిన్ గా చేసినా శ్రీనిధి శెట్టికి మంచి క్రేజ్ ఉంది. తానూ రాసుకున్న కథలో వచ్చే స్పెషల్ సాంగ్ లో శ్రీనిధి పర్ఫెక్ట్ గా సరిపోతుందని ప్రశాంత్ ఆమెను తీసుకున్నాడట.

పైగా శ్రీనిధి శెట్టిని హీరోయిన్ ను చేసింది ప్ర‌శాంతే. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాడట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు