మాస్ మహారాజ్ సినిమా కోసం “కేజీయఫ్” మేకర్స్.!

మాస్ మహారాజ్ సినిమా కోసం “కేజీయఫ్” మేకర్స్.!

Published on Dec 23, 2020 3:03 PM IST

Khiladi

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా “క్రాక్” అనే పవర్ ఫుల్ కాప్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఇక అలాగే ఈ ప్రాజెక్ట్ లైన్ లో ఉండగా అనౌన్స్ చేసేసిన మరో ఆసక్తికర ప్రాజెక్ట్ “ఖిలాడి”. దర్శకుడు రమేష్ వర్మతో ప్లాన్ చేసిన ఈ చిత్రం తాలుకా ఫస్ట్ లుక్ పోస్టర్ కు గాను మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

అయితే ఇది వరకు ఈ సినిమాను ఒక భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ను జోడిస్తారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కేజీయఫ్ లాంటి సాలిడ్ యాక్షన్ సినిమాకు అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ లు అందించిన స్టంట్ కొరియోగ్రఫి బ్రదర్స్ అంబు – అరివు లను రంగంలోకి దింపారు. దీనితో మరి ఈ సినిమాలో యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.

అలాగే ప్రస్తుతం హైదరాబద్ లో ఒక భారీ జైల్ సెట్ లో కీలక స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కుతుందట దీనిని వీరి అండర్ లో చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయతి లు నటిస్తున్నారు. అలాగే రవితేజ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా సత్యనారాయణ కోనేరు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు