ఖైదీ నైజాం రైట్స్ ధర చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే !
Published on Dec 29, 2016 4:43 pm IST

khaidi150-1
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ ప్రతి అంశంలోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ముందుగా చిరు తన స్లిమ్ లుక్ తో అభిమానులకు మతిపొగిడితే తాజాగా విడుదలవుతున్న పాటలు మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఇక ఈ చిత్రం తాలూకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు చూస్తే మతిపోవడం ఖాయం. ఇప్పటికే శాటిలైట్ హక్కులు రూ. 13 కోట్లకు, కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులు రూ.8.5 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 14 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైన విషయం తెలిసిందే.

తాజాగా ఈ చిత్ర నైజాం హక్కులు రూ. 14 కోట్లకు అమ్మడై మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. నైజాం ఏరియాలో చిరంజీవికున్న బలమైన ఫ్యాన్ బేస్, 150వ సినిమా పట్ల జనాల్లో ఉన్న ఆసక్తి, అంచనాలు వంటి కారణాల వలన డిస్ట్రిబ్యూటర్లు ఇంత పెద్ద మొత్తం చెల్లించడానికి సిద్ధమయ్యారు. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 100 కోట్ల వరకు జరిగినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook