‘మాస్‌ మహారాజా’ మాస్ సాంగ్ స్టార్ట్ చేశాడు !

Published on Dec 13, 2021 9:00 am IST

మాస్‌ మహారాజా రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి నాయికలుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం లోని మాస్ సాంగ్ షూట్ ను చిత్రబృందం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్‌ డైరెక్టర్‌ గాంధీ నడికుడికర్‌ వేసిన సెట్‌ లో రవితేజ, మీనాక్షి చౌదరిల పై ఈ పాటను షూట్ చేస్తున్నారు.

ఇక ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతుల్ని సమకూర్చుతున్నారు. ఈ నెలాఖరుకు ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న సినిమాను థియేటర్‌లో రిలీజ్ కాబోతుంది. పెన్‌ స్టూడియోస్‌, ఏ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి. కోనేరు సత్య నారాయణ ఈ సినిమాకి నిర్మాత.

సంబంధిత సమాచారం :