మరో సీనియర్ హీరోయిన్ కి కరోనా పాజిటివ్ !

Published on Jan 10, 2022 9:31 pm IST

బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. ఖుష్బూ సోషల్‌ మీడియాలో ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘మొత్తానికి నాకు కూడా కరోనా వచ్చేసింది. గత రెండు వేవ్‌ ల నుంచి నేను తప్పించుకున్నాను. కానీ, ఈ సారి మాత్రం కోవిడ్‌ నన్ను అటాక్ చేసింది. నిన్న సాయంత్రం వరకు నాకు ఎలాంటి లక్షణాలు లేవు.

అయితే, ఆ తర్వాత మాత్రం నాకు ముక్కు కారడం మొదలైంది. అది ఎక్కువ కావడంతో టెస్ట్‌ చేయించుకున్నాను. పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. అయితే, ప్రస్తుతం నాకు ఒంటరిగా ఉండటం చాలా కష్టంగా ఉంది. కానీ తప్పదు. కాబట్టి రాబోయే 5 రోజులు నన్ను ఎంటర్‌టైన్‌ చేయండి. అలాగే మీరు కూడా ఏమైనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే.. వేంటనే పరీక్షించుకోండి’ అంటూ ఖుష్బూ ట్వీట్‌ పెట్టింది.

సంబంధిత సమాచారం :