మహేష్ డెడికేషన్ ఎలాంటిదో చెప్పిన హీరోయిన్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివల కలయికలో రూపొందుతున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా కైరా అద్వానీ నటిస్తోంది. షూటింగ్ ఆరంభం నుండి సినిమా పట్ల చాలా ఎగ్జైటెడ్ గా ఉన్న ఈమె హీరో మహేష్ బాబు డెడికేషన్ పట్ల చాలా ఇంప్రెస్ అయ్యారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె మహేష్ చాలా కష్టపడతారు, ఆయనకు డెడికేషన్ చాలా ఎక్కువ అన్నారు. అంతేగాక ఆయన ఒకేరోజు 5 సన్నివేశాలను చేస్తారని, రెండు రోజులు లంచ్ కూడా చేయకుండా వర్క్ చేశారని, సెట్స్ లో ఎలాంటి కంప్లైంట్స్ ఉండవని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఆఖరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం మార్చి 25న స్పెయిన్ వెళ్లనున్నారు. ఏప్రిల్ 20న విడుదలకానున్న ఈ సినిమాను పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ.