కూతురు భవిష్యత్తుపై కియారా కామెంట్స్.. నెట్టింట ట్రోలింగ్..!

కూతురు భవిష్యత్తుపై కియారా కామెంట్స్.. నెట్టింట ట్రోలింగ్..!

Published on May 17, 2026 1:00 AM IST

Kiara Advani

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన కూతురు సరాహా పెద్దయ్యాక ఆమెకు ఇచ్చే రిలేషన్‌షిప్ సలహాల గురించి ఆసక్తికరంగా స్పందించింది. తన కుమార్తె జీవితాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా ఆస్వాదించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్రేమ, డేటింగ్, పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది పూర్తిగా ఆమె ఇష్టమని, దానిపై ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేసింది.

తన వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా చెప్తూ.. ‘జీవితం మనం అనుకున్నట్లు సాగదు. నా జీవితం కూడా అలా సాగనందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఎందుకంటే నా భాగస్వామి సిద్ధార్థ్ మల్హోత్రాతో నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎదిగే క్రమంలో ఏర్పడే ప్రతి బంధం మనకు ఒక పాఠం నేర్పుతుంది’ అని కియారా పేర్కొంది.

జీవిత ప్రయాణంలో తప్పులు జరగడం సహజమేనని, వాటి నుండి నేర్చుకుని ముందుకు సాగడమే ముఖ్యమని తన కూతురికి చెప్తానని కియారా వివరించింది. అయితే, కూతురు భవిష్యత్తుపై ఇప్పుడే ఈ విధమైన కామెంట్స్ అవసరం లేదని కియారాపై నెటిజన్లు మండి పడుతున్నారు.

తాజా వార్తలు